అంచనాలు పెంచేస్తున్న నానువ్వే ట్రైలర్

తమన్నా, కల్యాణ్ రామ్ జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”నా నువ్వే” ట్రైలర్ సినిమాపై అఁచనాలను భారీగా పెంచేసింది. కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్లో కనబడబోతున్నారు. ట్రైలర్ ఆధ్యంతం ఫ్రెష్ గా కొత్తతరం లవ్ స్టోరీని చూస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది. కల్యాణ్ రామ్, తమన్నా జంట చూడముచ్చటగా ఉంది. అనుకోకుండా కలిసి, ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారడం.. సహజీవనం వంటి అంశాలతో సినిమా రూపొందించారు.


తమన్నా రేడియోజాకీగా చేస్తున్న ఈ చిత్రం ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందింది. మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతంతో పాటు ప్రఖ్యాత కెమెరా మెన్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం చిత్రానికి హైలైట్ కానున్నాయి. ఇటీవల విడుదలైన పాటలు యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. లవ్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉండే ఈ సినిమా కల్యాణ్ రామ్ కి టోటల్ మేకోవర్ ను ఇస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.