‘అంతకుమించి’ రష్మి మూవీ ట్రైలర్‌

ఎస్.జై. ఫిలింస్ పతాకంపై సతీష్ గాజుల, ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ‘అంతకుమించి’ . ఈ చిత్రంలో జై, రష్మి జంటగా నటిస్తున్నారు. థ్రిల్లర్ రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మి విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్‌ పేర్కొంది. చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమౌతోందని తెలిపింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘అంతకుమించి’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నన్ను ఇంప్రెస్ చేసింది. ఈ ట్రైలర్‌ చూశాక సినిమా ఎప్పుడు చూద్దామా అనే లా అనిపిస్తుంది. చిత్ర బృందని ఆల్‌ ది బెస్ట్‌ సినిమా మంచి విజయం సాధించానని కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ…’ మా ట్రైలర్‌ను సుకుమార్‌ గారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. మేము అడగగానే మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసినందుకు సుకుమార్‌ గారికి మా చిత్ర బృందం తరుఫున కృతజ్ఞతలు. సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తియ్యాయి. త్వరలనే విడుదల తేదీని ప్రకటిస్తాం. సుకుమార్‌ గారు విడుదల చేసిన ట్రైలర్‌ను రేపు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయనున్నాం’ అన్ని తెలియజేశారు