అక్టోబర్ 4న విజయ్‌ నోటా


‘గీత గోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన విజయ్ దేవరకొండ తాజాగా ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ముందుగా చెప్పినట్టే ‘టాక్సీవాలా’ కంటే ముందే ఈ చిత్రం విడుదలవుతోంది. అక్టోబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. విజయ్ గత విజయాల దృష్ట్యా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రూపొందుతున్న ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయగా జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటిస్తోంది.