అఖిల్‌ 3వ చిత్రం పేరు ఇదేనా..?

అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఫిల్మ్ ఛాంబర్లో కూడ ఈ టైటిల్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి విదేశాల్లోనే జరుగుతోంది.

నాగార్జున కెరీర్లోని హిట్ సినిమాల్లో ‘మజ్ను’ చిత్రం ఒకటి. ఇప్పుడు అదే టైటిల్ అఖిల్ మూవీకి పెడుతుండటం విశేషం. వెంకీ అట్లూరి మొదటి సినిమా ‘తొలిప్రేమ’ భారీ విజయాన్ని అందుకోవడంతో అఖిల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.