అఖిల్ తో యంగ్ డైరెక్టర్!

వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా ‘తొలిప్రేమ’. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా యూఎస్ లో మిలియన్ మార్క్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యువ హీరోలు తమతో సినిమా చేయాలని సంప్రదించగా.. వెంకీ మత్రం అక్కినేని అఖిల్ కు కథ సిద్ధం చేస్తున్నాడట. అఖిల్ హీరోగా నటించిన మొదటి రెండు సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి.
మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచుస్తోన్న అఖిల్ ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన వెంకీతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తాడా..? లేక బయట బ్యానర్ లో సినిమా ఉంటుందా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!