అఖిల్ సినిమా రెగ్యులర్ షూటింగ్..!

అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్లోని రెండు సినిమాలు ఆశించినంతగా కలిసి రాకపోయినా తన మూడో చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో పకడ్బంధీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ విదేశాల్లో షూట్ చేయనున్నారు. అఖిల్ ఎంట్రీ సీన్స్ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం.

రొమాంటిక్ ఎంటర్ టైనర్గా రూపొందించే ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా చేయనుంది. వరుణ్ తేజ్ మూవీ తొలి ప్రేమతో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కించే అఖిల్ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వగా ప్రీ-ప్రొడక్షన్కు చాలా సమయం తీసుకున్నారు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.