అట్లీతో తారక్ సినిమా!

ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న యంగ్ టైగర్ తారక్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ మూవీ రామ్ చరణ్ తో కలిసి చేయబోతున్నాడు. ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో మరో సినిమా చేసేందుకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.

అట్లీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. రాజారాణి, మెర్సల్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అట్లీ పూర్తిగా తెలుగులోనే ఓ చిత్రాన్ని చేయాలని చాలాకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యనే తెలుగు సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. తారక్ అట్లీ కాంబినేషన్లో వచ్చే సినిమా అశ్వనీదత్ నిర్మించబోతున్నట్టు సమాచారం. సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభించే అవకాశముంది.