‘అత్తారింటికి దారేది’ తమిళ్‌ వెర్షన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘అత్తారింటికి దారేది’. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు గొట్టి ఓ ట్రెండ్‌సెట్‌ చేసింది. త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌ స్టామినా ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది.

తండ్రి కూతురు, అత్తా మేనల్లుడు, బావ మరదలు వంటి పలు బలమైన ఎమోషన్స్ ను కలిగిన ఈ కథకు పవన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ స్టైలిష్ టేకింగ్ కలవడంతో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండియేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళ్‌లో రీమేక్‌ కాబోతోంది. ఈ మూవీ తమిళ్‌ రైట్స్‌ లైకా చేతికి వచ్చినట్లు.. అందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అంటూ ఈ సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. తమిళ్‌ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మరి తమిళంలో పవన్ పాత్రను ఏ హీరో చేస్తారో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates