అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్!

అరుంధతి,రుద్రమదేవి, సైజ్ జీరో తర్వాత బాహుబలి,బాహుబలి 2 లో నటించిన అనుష్క గ్లామర్ కి ఎక్కడా చోటు ఇవ్వలేదు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందిన ‘భాగమతి’ చిత్రం కూడా మరో అద్భుత విజయం సాధించడమే కాకుండా టాప్ హీరోలకు వచ్చినన్ని కలెక్షన్లు రావడం మరో విశేషం. ఈ చిత్రం సూపర్ హిట్ తర్వాత అనుష్కకు మరి కొన్ని ఆఫర్లు వచ్చినా..వాటన్నింటినిక పక్కనబెట్టి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించింది.అనుష్కకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండటంతో..తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా మొదలుకావడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో, ఈ లోగా బరువు తగ్గడంపై అనుష్క దృష్టి పెట్టాలనుకుంటోందట. మరి ఈ సినిమాతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!