అనుష్క మూవీలో నాని కీలక పాత్ర

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి రాసుకొన్న కథ మహిళా ప్రాధాన్యమున్న చిత్రమని సమాచారం. ఇందులో నాని కథానాయకుడిగా నటిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది.

కథలోని పాత్రకు అనుష్క చక్కగా సరిపోతారని దర్శకుడు చంద్రశేఖర్ భావిస్తున్నారట. అందులో భాగంగానే అనుష్కను కలిసి కథ వినిపించారట. భాగమతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న అనుష్క ఆ తర్వాత మరో చిత్రం రాలేదు. ఈ చిత్రంపై అనుష్క ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క ఈ చిత్రంలో నటించే అవకాశముందని అనుకుంటున్నారు. ముందుగా అనుకున్నట్లు ఈ చిత్రంలో నాని హీరో పాత్ర కాదని.. అయితే ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.