అన్నయ్య చిరంజీవి (గ్రీన్‌ ఛాలెంజ్) స్వీకరించిన జనసేన అధినేత

మెగాస్టార్‌ చిరంజీవి (గ్రీన్‌ ఛాలెంజ్)‌ ను స్వీకరించి తన ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటి. అనంతరం తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయతే అన్నయ్య చిరంజీవి విసిరిన(గ్రీన్‌ ఛాలెంజ్)ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. అయితే ‘హరితహారం’ ప్రోగ్రాం క్యాంపెయిన్‌లో తాజాగా మహేష్ పాల్గొన్నారు. దీనికోసం పోలీస్ బాసులను కలిసి కాసేపు వారితో ముచ్చటించారు. పోలీసు బాసులు ఆయనకు ఒక మొక్కను బహుమతిగా ఇచ్చారు.