
Sukumar about Game Changer:
తెలుగు సినిమా పరిశ్రమలో రెండు పెద్ద పేర్లు ఏంటంటే, ఎస్.ఎస్. రాజమౌళి మరియు సుకుమార్. రాజమౌళి తన స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇక సుకుమార్ “పుష్ప”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వీరి మధ్య పరస్పర గౌరవం ఉన్నా, అప్పుడప్పుడు సుకుమార్ చేసే కొన్ని వ్యాఖ్యలు ఆయన క్రెడిబిలిటీని తగ్గిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుకుమార్ పూరి జగన్నాథ్ “లైగర్” సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ సినిమా విఫలం కావడంతో పూరి కెరీర్‌తో పాటు సుకుమార్ క్రిడిబులిటీ కూడా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సినిమాపై సుకుమార్ చేసిన కామెంట్ల కారణంగా వచ్చింది.
డల్లాస్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో సుకుమార్, “గేమ్ చేంజర్” సినిమా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు రావొచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చరణ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. “రంగస్థలం” కంటే ఎక్కువ ఎమోషన్‌తో సీన్స్ ఉంటాయని అందరూ ఊహించారు.
అయితే సినిమా విడుదల తర్వాత, ఆ క్లైమాక్స్ సీన్ సాధారణ యాక్షన్ సీక్వెన్స్‌గా ఉండి, ఎటువంటి ఎమోషనల్ డెప్త్ లేకుండా నిరాశపరిచింది. “సుకుమార్ అసలు ఈ సినిమా చూశాడా?” అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుకుమార్ ఇచ్చిన హైప్ ఇప్పుడు తనకే హాని చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సినిమా విడుదలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, అది ఆయన క్రెడిబిలిటీని తగ్గించే అవకాశం ఉంది. కొన్నిసార్లు సినిమా ప్రమోషన్ కోసం చేసే హైప్, చివరికి డైరెక్టర్స్‌కు నెగటివ్ ఎఫెక్ట్‌గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.