అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య ప్రధాని అవుతుందట..

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య రాజకీయాల్లో రాణిస్తుందట. హైదరాబాద్ నగరానికి చెందిన జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ ఆరాధ్య భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతుల ముద్దులపట్టి ఏకంగా దేశానికి ప్రధానమంత్రిగా చక్రం తిప్పనుంది. కానీ ఆరాధ్య దేశ ప్రధాని కావాలంటే ఆమె పేరును రోహిణిగా మార్చుకోవాలని సూచించారు. తాను చెప్పినవీ అన్నీ జరిగాయి అంటూ.. ధీమాగా వ్యక్తం చేశారు జ్ఞానేశ్వర్. అగ్ర హీరోలైన చిరంజీవి, రజనీకాంత్ ల రాజకీయ రంగ ప్రవేశం, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికార పీఠాన్ని ఎక్కడం వంటి సంఘటనలన్నీ తాను జోస్యం చెప్పాగా జరిగాయని తెలిపారు.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా తిరిగి ఎన్నికవుతారని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం చేపడతారని తెలిపారు. తమిళనాడు మధ్యంతర ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీ సాధిస్తుందని.. ఆయన సీఎం పీఠాన్ని ఎక్కుతారన్నారు. 2024లో భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని, రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ 2019లోనే పెళ్లాడాలని.. 2018లో అతనికి కొంత కష్టకాలం ఎదురుకానుందని జ్ఞానేశ్వర్ జోస్యం చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates