అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ!

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చి తన టాలెంట్ తో అనతికాలంలోనే ఆ ముద్ర చెరిపేసుకొని టాలీవుడ్లో ఒక స్టార్ గా వెలుగుతున్నాడు రామ్ చరణ్ తేజ్. తాత పోలికలు, నటనా వారసత్వాన్ని పొందిన జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభతో ఎదిగి టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఏమైనా ఉందా! రికార్డులన్నీ చెరిగిపోవూ? ఆ టైం కూడా తొందరలోనే రాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్, చెర్రీల మల్టీస్టారర్ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే.
దీనికి సంబందించి కసరత్తులు చేయడానికి ఎన్టీఆర్, రాంచరణ్ లు ఇద్దరూ కలిసి విదేశాలకు పయనమవడానికి విమానాశ్రయంలో వేచి ఉన్నపుడు తీసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. షూటింగ్ కోసం వెళ్తున్నారా లేక బాడీ వర్కౌట్ ల కోసం వెళ్తున్నారా అని ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీరితో పాటు ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ ఉండటం బాడీ షేప్ అవుట్ కోసమే విదేశాలకు వెళ్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.