అమ్మే నాలో ధైర్యం నింపింది!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వరల్డ్ ఐటీ కాంగ్రెస్ క్లోజింగ్ సెర్మనీలో మెరిసింది. మెంటల్ హెల్త్ ఆవశ్యకత, డిప్రెషన్ వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని వివరించే ప్రయత్నం చేసింది. తాను డిప్రెషన్‌లో కూరుకుపోయినప్పుడు తన అమ్మే తనకు అండగా నిలిచిందని తెలిపింది. ఒకానొక టైంలో ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్లి తిరిగి కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేసింది.? బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ స్టార్ హీరోయిన్‌గా టర్న్ తీసుకునే టైంలో ఫ్లాపులు ఎక్కువయ్యాయి అవకాశాలు తగ్గిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు ఎలా నెగ్గుకురావాలో అర్థం కావటం లేదు. సరిగ్గా అప్పుడే 2014లో దీపికా తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. చాలా రోజుల వరకు దీపిక బయటకి రాలేదు. ఈ రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అమ్మే ఆమెకు అండగా నిలబడింది.
నువ్వు ఒంటరి కాదు మేమున్నామని చెప్పింది. అంతా అయిపోయిందనుకున్న కూతురుకు అసలు లైఫ్ ఇప్పుడే మొదలైందని చెప్పింది. ఓటమి నుంచి ఎలా గెలవాలో నేర్పింది. అనుక్షణం ఆమె వెన్నంటే ఉంటూ ధైర్య నూరిపోసింది. మళ్లీ జీవితంపై ఆశలు చిగురించేలా చేసింది. రెట్టించిన ఉత్సాహంతో జీవితంలో ముందడుగు వేసింది. డిప్రెషన్‌ను జయించింది.డిప్రెషన్ నుంచి బయటపడాలనుకునే ఆలోచనే మనల్ని సగం గెలిపిస్తుందని, ఈ విషయంలో తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని చెప్తోంది దీపిక.