‘అరవింద సమేత’ పై మరో ఆసక్తికర వార్త

‘యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌’ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి స్లిమ్‌ అండ్‌ స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడట. క్లాస్‌గా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా రాయసీయ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ హీరోగా ఎన్టీఆర్‌ అలరించనున్నాడని తెలుస్తోంది.ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్ రాధకృష్ణ నిర్మిస్తున్నారు