‘అరవింద సమేత’ మరో సీనియర్‌ నటుడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత’ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగబాబు ఎన్టీఆర్‌ తండ్రిగా నటిస్తున్నారని సమాచారం. అయితే తాజాగా మరో ప్రముఖ నటుడు అరవింద సమేత చిత్రంలో చేరినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్‌ కీలకపాత్ర నటిస్తున్నడట. ఈ మూవీలో అతడిగి చాలా ప్రధాన్యత ఉన్న పాత్ర అని అంటున్నారు.. ఇప్పటికే సుధాకర్‌ షూటింగ్‌ పాల్గొంటున్నారు. ముఖ్యమైన సీన్స్‌ను అతడిపై చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హగ్దే హీరోయిన్‌ గా నటిస్తుంది. హారిక క్రియేషన్స్‌ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ మూవీ నిర్మిస్తుండగా, థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.