అల్లు అర్జున్‌ తర్వాతి చిత్రం!

హీరో అల్లు అర్జున్‌ తర్వాతి చిత్రం ఖరారైనట్లు సమాచారం. ఆయన ఈ సంవత్సరం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. దీని తర్వాత అనంతరం అర్జున్‌ తన తరువాత చిత్రాన్ని ప్రకటించలేదు.

అయితే దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, విక్రమ్‌ కె కుమార్‌, సురేందర్‌ రెడ్డిలతో కలిసి బన్నీ మూడు సినిమాల కోసం పనిచేయనున్నట్లు ప్రచారం జరిగింది. ముందుగా ఏ దర్శకుడితో పని చేయనున్నారో మాత్రం ఇంకా తెలియా లేదు. కాగా బన్నీ చివరికి విక్రమ్‌ కె కుమార్‌ ప్రాజెక్టును ఖరారు చేసినట్లు తాజా సమాచారం. నల్లమలుపు బుజ్జి, నాగ అశోక్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారట. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రటకన రావాల్సి ఉంది.కాగా విక్రమ్‌ గత ఏడాది ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ చిత్రంలో అఖిల్‌ కథానాయకుడు. కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున ఈ చిత్రాని నిర్మించారు.