అల్లు కాంపౌండ్ లో సంపత్ నంది!

కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ సంపత్ నంది ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ తో ‘రచ్చ’ వంటి మాస్
కమర్షియల్ సినిమాను రూపొందించిన సంపత్ నంది.. అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాడట. ఇటీవల కథ సిద్దమవడంతో బన్నీకి వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.బన్నీకి గనుక కథ నచ్చితే.. నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ తో సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయి. ఆ తరువాతే సంపత్ నందితో సినిమా ఉంటుందని చెబుతున్నారు.