HomeTelugu Big Storiesఅవకాశాన్ని కొందరు లక్‌ అని.. కొందరు దేవుడి ఆశీర్వాదమని అంటారు: రజనీ

అవకాశాన్ని కొందరు లక్‌ అని.. కొందరు దేవుడి ఆశీర్వాదమని అంటారు: రజనీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 7న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలకు ఇప్పటికే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ కాలా కరికాలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రమోషన్స్ కోసం రజనీకాంత్ సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రజనీకాంత్‌తో పాటు ఆయన అల్లుడు కాలా చిత్ర నిర్మాత ధనుష్ కూడా హాజరయ్యారు.

7 2

ఈ చిత్రం గురించి రజనీకాంత్‌ మాట్లాడుతూ 1978లో నా తొలి తెలుగు చిత్రం “అంతులేని కథ” రిలీజైంది. ఆ తర్వాత దాదాపు 20 చిత్రాలు తెలుగులో చేశాను. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, తొలిరేయి గడిచింది వంటి పలు చిత్రాలు చేశాను. తర్వాత కొద్ది బ్రేక్ వచ్చింది. తెలుగు చిత్రాల్లో నటించలేదు. తెలుగులో అంత బిజీ అయి ఇక్కడ కంటిన్యూ చేయాలా, లేక తమిళంలోకి వెళ్లాలా అనే కన్‌ఫ్యూజన్‌లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. బాలచందర్ ద్వారా నా కెరీర్ తమిళంలో మొదలయింది కాబట్టి తమిళంలో నా కెరీర్ కంటిన్యూ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుగు ప్రేక్షకులు కూడా నాపై అంతే ప్రేమను చూపించడం నాభాగ్యం. ఆ బ్రేక్ తర్వాత మోహన్‌బాబు పెదరాయుడు చిత్రంలో మంచి బ్రేక్ ఇచ్చారు. దాని తర్వాత బాషా, నరసింహ, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో,
శివాజీ చిత్రాలతో మన మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు.

హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పెద్దాయన ఎన్టీఆర్ గారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునే వాడిని. ఇప్పుడు ఆయన చాలా గుర్తొస్తున్నారు. అది ఎందుకనేది మీకు తెలుసు. ఈ సమయంలో నాకు బాలచందర్ తర్వాత ఇంకో గురువు దాసరి నారాయణ రావు గురించి గుర్తు చేసుకుంటాను. నన్ను ఆయన బిడ్డలా ప్రేమించే వారు అన్నారు. ధనుష్ చెప్పారు.. ఒకే రజనీకాంత్ అని.. ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ, అందరూ ఒక్కొక్కరే. కేవలం అవకాశం మాత్రమే పెద్దవాళ్లను చేసింది. ఇండస్ట్రీలో అందరికీ అవకాసం దొరుకుతుంది. దానిని కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. ఆ అవకాశాన్ని దేవుడిపై నమ్మకం లేని వారు లక్ అని చెబుతారు. దేవుడిపై నమ్మకమున్న వారు దొరకడం కొందరు లక్ అని చెబుతారు. ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ఫీల్డ్ అయినా అవకాశం దొరికినప్పుడు దానిని వదులుకోకూడదు. ఆ అవకాశాన్ని దేవుడిచ్చినట్లు భావించి కష్టపడి, శ్రమించి టోటల్ డెడికేషన్‌తో పనిచేస్తే దానికి తగిన ఫలం తప్పక దొరుకుతుంది.

నా చిత్రం గురించి నేను గొప్పగా చెప్పుకోవడం బాగుండదు. నేను సినిమా చూశాను చాలా బాగుందని రజనీ అన్నారు. కమర్షియల్‌గా మాత్రం కాదు. ఈ సినిమాలో మంచి మెస్సేజ్ ఉంది. ఓ కమర్షియల్ చిత్రాన్ని ఆర్టిస్టిక్‌గా రియాల్టీ మిక్స్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేయడం రంజిత్ స్టైల్. ఆసియాలోనే పెద్ద స్లమ్ ముంబైలో ఉంది. ఆ స్లమ్‌ ఏరియాలో ఉండే మనుషులు.. వారి జీవన విధానం ఎలా ఉంటుంది.. వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అనేది కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు రంజిత్‌ అద్భుతంగా
రూపొందించారని రజనీకాంత్ తెలిపారు. ఏ చిత్రంలో అయిన హీరో లేదా ఇంకో క్యారెక్టర్ మాత్రమే హైలైట్‌ అవుతుంది కానీ కాలా చిత్రంలో 5 నుంచి 6 పాత్రలు గుర్తుండిపోయేలా మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి అన్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ మంచి మ్యూజిక్‌ అందించారని తెలిపారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈశ్వరీ రావు బాగా చేశారని అన్నారు. హమా ఖురేషీ కూడా బాగా నటించారని అన్నారు. ధనుష్‌ ఈ చిత్రం ద్వారా తాను మంచి నటుడినే కాదు మంచి ప్రొడ్యూసర్‌ని అని ప్రూవ్ చేసుకున్నారు అన్నారు. ఈచిత్రం 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu