ఆకట్టుకుంటున్న నేలటిక్కెట్టు ట్రైలర్

తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మాళవిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న
నేలటిక్కెట్టు మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సినిమా టీజర్, ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. బుధవారం
విడుదల చేసిన ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇందులో అమ్మ, అక్క చెల్లి కాకుండా ఫస్ట్ టైమ్ లైఫ్ లో ఓ కొత్త
రిలేషన్ కనిపిస్తోంది అంటూ డైలాగ్ ట్రైలర్ ప్రారంభంలో రవితేజ తన ప్రియురాలి గురించి చెప్పిన డైలాగ్ బాగా
ఆకట్టుకుంది..ఇంకా చుట్టూ జనం, మధ్యలో మనం.. అది కాదురా లైఫ్ అనే డైలాగ్ బాగుంది. యాక్షన్, ప్రేమ సన్నివేశాలతో
ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ బాణీలు సమకూర్చారు. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మానందం,
జయప్రకాశ్ రెడ్డి, అలీ, రఘుబాబు, పోసాని తదితర పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ లో ”ముసలితనం అంటే చేతగానితనం
కాదురా.. నిలువెత్తు అనుభవం” అంటూ రవితేజ డైలాగ్ చూస్తుంటే వృద్ధులకు సహాయం చేసే కథాంశంతో సినిమా
రూపొందించినట్లు తెలుస్తోంది. నేను ఇక్కడ సింహాసనంపై కూర్చుంటే స్టేట్ మొత్తం నడవదు.. మోకాళ్లపై దేకుద్ది.. నా లైఫ్ నా
ఇష్టంరా నేను ఎదగడానికి ఎవడినైనా తొక్కేస్తా అంటూ జగపతిబాబు తన విలనిజాన్ని చూపిస్తూ చెప్పే డైలాగ్… కౌంటర్ గా
నువ్వు రావడం కాదు.. నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయింటెయిన్ చేయ్ అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్ లో
ఆకట్టుకుంటున్నాయి.