ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా అభిమానుల వేడుకలు

ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా అభిమానుల వేడుకలు

1. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగష్టు 9 న, జన్మదినోత్సవ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిద్ది రాంబాబు ఆద్వర్యం లో r .t .c క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35mm లో థియేటర్ యజమాని విశ్వంబర్ కేక్ కట్ చేయగా మేనేజర్ లు కుమార్ , శ్రీనివాస్ రెడ్డి , పాల్గొన్నారు . తదనంతరం కాచిగూడ ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు బ్రెడ్ లు పంచారు . ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , కాలేరు శ్రీనివాస్ రావు , సిద్ది రాజు , వెంకటేష్ యాదవ్ , బాలాజీ , బొడ్డు  బాబు , కృష్ణ గౌడ్ , వడ్ల రాజు , మధు తదితర అభిమానులు పాల్గొన్నారు . 

2. ఆగష్టు 9 న, సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవ సందర్బంగా అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన రాష్ట్ర అధ్యక్షులు ఖదీర్ ఘోరీ ఆధ్వర్యంలో షాద్ నగర్  ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్లు పంచారు . ఈ సందర్బంగా ఆసుపత్రి superintendent తమ హీరో జన్మ దిన సందర్బంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం అభినందనీయం అన్నారు . ఈ కార్యక్రమం లో కిరణ్ , ప్రవీణ్ , జహంగీర్ , మల్లికార్జున్ , హర్షత్ తదితర అభిమానులు పాల్గొన్నారు 

3. గుంటూరు జిల్లా రేపెల్లె లో  ఘట్టమనేని యువత అధ్యక్షులు గుమ్మడి రవి కృష్ణ ఆద్వర్యం లో ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా ఆంధ్ర రత్న అప్పర్ ప్రైమరీ స్కూల్ లో కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణి చేసి అనంతరం స్కూల్ ఆవరణ లో మొక్కలను నాటారు . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యం లో అభిమానులు రక్త దానం చేసి ప్రభుత్వ ఆసుపత్రి లో ని రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంచారు . కృష్ణ పుష్కరాలు సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య చేసే అన్నదాన కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షులు k . agastya కు ఆర్ధిక సాయం అండ జేశారు . ఈ కార్యక్రమం లో గుమ్మడి రామ కృష్ణ , సాహూల్ syed , నవీన్ దామెర్ల , రియాజ్ బాషా , పప్పు , జి . రామ కృష్ణ , స్వరాజ్ కుమార్ , లక్కీ సాంబ తదితర అభిమానులు పాల్గొన్నారు . 

4. విజయవాడ కృష్ణలంక లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని కృష్ణ మోహన్ ఆద్వర్యం లో వి . యమ్ . రంగ  పాఠశాల లో  ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా హెడ్  కట్ చేయగా, విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టారు . ఈ కార్యక్రమం లో కృష్ణ ప్రసాద్ , మాగంటి భువన్ , sahool syed(తెనాలి ) , నవీన్ మంగళగిరి తదితర అభిమానులు పాల్గొన్నారు . 

5. శ్రీకాకుళం లో  ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీను ఆధ్వర్యంలో అరసవల్లి  సూర్య నారాయణ స్వామి దేవాలయం లో పూజలు జరిపి , బ్లడ్  పడుతున్న పరవింద బాలికకు 9000 రూపాయల  ఆర్ధిక సహాయం , దేవస్థాన అన్నదాన పధకానికి 1000 రూపాయలను అందజేశారు . అనంతరం  కిన్నెరా థియేటర్ లో కేక్ కట్ చేసి ఆనందం తో అభిమానులు మహేష్ బాబు జన్మ దిన వేడుకలను జరుపుకున్నారు . అరసవల్లి దేవస్థానం E .O వి .  శ్యామల దేవి కాన్సర్ బాధితురాలికి 2000  సాయం అందజేశారు . ఈ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది భాస్కరభట్ల శ్రీనివాస్ చక్రవర్తి , mruthyunjaya రావు , యుగంధర్  పాటు అభిమానులు మామిడి శంకర్ యాదవ్, మధు , తారక్ , తదితర అభిమానులు పాల్గొన్నారు 

6. రంగ రెడ్డి జిల్లా కేసరి మండల దమ్మాయి గూడ లో  ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా యస్ . కే . జావీద్ ఆద్వర్యం లో సర్పంచ్  యాదగిరి గౌడ్ , ఉప సర్పంచ్ కార్తీక్ గౌడ్ , వార్డ్ మెంబెర్ d . నరసింహ రెడ్డి , సమక్షం లో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు ,  చిన్న పిల్లలకు పండ్లు పంచి తమ అభిమానం చాటుకున్నారు . ఈ కార్యక్రమం లో సతీష్ , సాయి , రాజశేఖర్ , మహేష్ , తదితర అభిమానులు పాల్గొన్నారు 

7. కరీంనగర్ లో  ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా సూపర్ స్టార్  సేన జిల్లా అధ్యక్షులు మసగొని సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ హోసింగ్  బోర్డు కాలనీ old age హోమ్ లో కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు . ఈ కార్యక్రమం లో భూమేష్ , హరీష్ , బబ్లూ , వినయ్ శ్రీమాన్ ,కృష్ణమాచార్య , మురళి, శివ కృష్ణ, సాయి కృష్ణ, దినేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు . 

8. విజయవాడ గాంధీ నగర్ శ్రీ దుర్గ కళామందిర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు భవాని ప్రసాద్ (చంటి ), ప్రధాన కార్యదర్శి v .l. రెడ్డి ఆధ్వర్యం లో  ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా వారం రోజుల పాటు వారోత్సవం నిర్వహించారు . ఈ సందర్బంగా ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తొర్లపాటి కుటుంబ రావు , ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యనారాయణ కేక్ కట్ చేసారు . ఈ సందర్బంగా తొర్లపాటి కుటుంబ రావు మాట్లాడుతూ మహేష్ అభిమానులు సేవ కార్యక్రమం చేపట్టడం వాళ్ళ నటుడు గానే కాకుండ సేవ భావం  కీర్తి ని సంపాదించి పెడుతున్నారు అన్నారు . కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ తన గ్రామం బురిపాలెం తో పాటు , తెలంగాణ లో ని మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురం  దత్తత తీసుకోవడం ద్వారా శ్రీమంతుడిగా ఆదర్శంగా నిలిచారు . ఈ సందర్బంగా పేద విద్యార్థులకు ఏడాది పాటు బస్సు pass ల  అందజేశారు . skcv పిల్లల  హాస్టల్ లో అన్నదానం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో పరుచూరి విజయ లక్ష్మి , సాకేత్ , మాగంటి భువన్ , సంతోష్, కృష్ణ,  మాధవ్,శ్రీను, నాగేశ్వర్ రావు, తదితర అభిమానులు పాల్గొన్నారు . 

9. Y .s .r జిల్లా ఎర్రగుంట్ల మండలం r .t .p .p కొత్త గోపుల పురం గ్రామం లో ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్బంగా సాయి బాబా టెంపుల్ లో అభిషేకం నిర్వహించారు . దేవస్థాన వ్యవస్థాపకులు s . కొండా రెడ్డి , కేక్ కట్ చేయగా , ఆయన ని సత్కరించారు . ఈ సందర్బంగా అక్కడి భక్తులకు పిల్లలకు పాలు పండ్లు పంచారు . ఆవరణ లో మొక్కలు నాటారు .  ఈ కార్యక్రమం లో, అధ్యక్షులు a . శ్రీనివాసులు ఆద్వర్యం లో ,  k . దస్తగిరి , సుబ్బారాయుడు , దానం , daniel , జీవ , తదితర అభిమానులు పాల్గొన్నారు . 

2

CLICK HERE!! For the aha Latest Updates