ఆడియన్స్ కు ‘రంగస్థలం’ టీమ్ సర్ప్రైజ్!

ఈ మధ్యకాలంలో వచ్చిన ఆడియోలు అన్నింటిలో ‘రంగస్థలం’ పాటలు ప్రత్యేకమనే చెప్పాలి. సంగీత పరంగానే కాకుండా సాహిత్య పరంగా కూడా సినిమా పాటలను మంచి క్రేజ్ ఏర్పడింది. ‘ఎంత సక్కగున్నావే’ అనే పాట శ్రోతలను అలరిస్తుంది. ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేసిన చిత్రబృందం ఈరోజు మరో రెండు పాటలను విడుదల చేసింది. మొత్తం సినిమాలో ఐదు పాటలను రిలీజ్ చేసింది చిత్రబృందం.అయితే ఇక్కడ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి మరో పాటను అలానే దాచి ఉంచిందని సమాచారం. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే గీత రచయిత చంద్రబోస్ ఈ పాటను స్వయంగా రాసి ఆలపించారట. ఈ నెల 18న సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. ఈ వేడుకలో చంద్రబోస్ ఆరో పాటను వినిపించబోతున్నారని సమాచారం. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.