జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. లక్ష్య సాధనకు కృషి చేయడం, సర్దుకుపోవడం, ఆనందంగా జీవించడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇదే విషయం గురించి నటి రేణూ దేశాయ్‌ తాజాగా మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిస్‌లో విలువైన ఓ ఫొటోను షేర్‌ చేశారు. సిమెంట్‌ గొట్టంలో ఓ కుటుంబం నివసిస్తున్న ఫొటో అది. ఓ తల్లి అమ్మాయిని పాఠశాలకు పంపడానికి సిద్ధం చేస్తున్నారు. వారు అంత చిన్న గొట్టంలో జీవితం గడపడం రేణుక ఏదో పాఠం నేర్పినట్లు ఉంది. ‘నా జీవితం బాగోలేదనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ ఫొటోను చూస్తుంటాను’ అని ఫొటోపై ఆమె రాశారు.

 

ఇటీవలే రేణు తన కుమారుడు అకీరాను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తన కుమారుడిపై ఆకాశమంత ప్రేమ కురిపించాలనిపిస్తోందని అన్నారు. తన కుమారుడు చిన్నబాబుగా ఉన్నప్పటి నుంచి అతడితో ప్రయాణం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పుడు అతనే తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ‘నా జీవితం కంటే.. నేను ఎక్కువగా ప్రేమించే పొడవైన స్వీట్‌ బాయ్‌ ఇతను’ అని ఆమె పోస్ట్‌ చేశారు.