”ఆఫీసర్” కు బ్రేక్‌

రామ్ గోపాల్ వ‌ర్మ , అక్కినేని నాగార్జున కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ఆఫీస‌ర్‌. ఇంటెన్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పొస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగావుంది. తాజాగా సినిమా ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ల‌ను అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున …ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌రు పాత్రలో క‌నిపించనున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా.. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా వ‌ర్మ ఈ చిత్రాన్ని రూపొందించార‌ట‌.

మొద‌ట‌గా ఈ చిత్రాన్ని మే 25న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇంకా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు అలాగే మిగిలుండడంతో జూన్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేశారు. ఈ చిత్రం లో మైరా స‌రీన్ హీరోయిన్ గా నటించ‌గా, కంపెనీ బ్యాన‌ర్ పై నిర్మించ‌డం విశేషం.