ఆయన నాకు సోదర సమానుడు: చిరంజీవి

నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్నికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్బంగా మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. హరికృష్ణ అకాల మరణం తీరని లోటు, ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించి, సరదగా నవ్విస్తూ మాట్లాడే హరికృష్ణ ఇలా అందర్నీ శోకంలో ముంచి వెళ్ళిపోతారని ఊహించలేదు అని చిరంజీవి అన్నారు. ఆయన నాకు సోదర సమానుడు. ఆయన కుటుంబానికి మానసిక స్థైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.