ఆసక్తి రేపుతున్న కాశీ సన్నివేశాలు

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ బేతాళుడు సినిమాతో మార్కెట్
పెంచుకున్నాడు. తాజాగా విజయ్ ఆంటోనీ నటిస్తున్న కాశీ చిత్రంలోని 7 నిమిషాల సినిమాను ముందుగానే సోషల్
మీడియాలో విడుదల చేశాడు. గతంలో బేతాళుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలనూ విడుదలకు ముందే రిలీజ్ చేసి ఆసక్తి
రేపాడు. అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడనిపిస్తోంది.

ఓ పల్లెటూరు అక్కడ ఓ పిల్లాడు.. ఎద్దును పాము కాటేయబోతుంటే తాడు తెంచుకుని ఎద్దు పారిపోవడంతో కథ
ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులతో చిన్నప్పుడే అమెరికా వెళ్లి అక్కడే చదువుకుని వైద్యుడుగా అమెరికాలో స్థిరపడతాడు
ఆంటోనీ. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో వెలితి.. ప్రతిరోజూ నిద్రలో పాము, ఎద్దు, పిల్లాడి ఏడుపు కలలోకి వస్తుంటాయి. ఇలా
ఎందుకొస్తుందో తెలియక తల్లిదండ్రులను అడుగుతాడు. తల్లిదండ్రుల ద్వారా ఓ నిజం తెలుసుకుని తన గతం గురించి
తెలుసుకోవాలని ఇండియాకు వస్తాడు.