ఆ టైటిల్ నిఖిల్ కోసమే!

ఇటీవల వరుసగా రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టిన నిఖిల్.. కన్నడ రీమేక్ ‘కిరాక్ పార్టీ’ పూర్తవుతుండడంతో తమిళ రీమేక్ ‘గణితన్’పై దృష్టిపెట్టబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ‘ముద్ర’ అనే టైటిల్ ని నిఖిల్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత ఠాగూర్ మధు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ‘ముద్ర’ అనే టైటిల్ కాస్త ఇంట్రస్టింగ్ గా, క్యాచీగా కూడా వుందని టీమ్ భావిస్తోంది.

బిబిసిలో రిపోర్టర్గా వర్క్ చేయాలనుకున్న ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవటం, తరువాత ఆ కేసునుంచి ఆ యువకుడు ఎలా బయట పడ్డాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్లో ఈ సినిమాను డైరెక్టర్ చేసిన టి ఎన్ సంతోష్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.