ఆ నటుడిపై ప్రయోగాలు పనిచేయవనుకున్న నిర్మాతలు

అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడ కనిపించే వాళ్లు పరిశ్రమలో కొందరుంటారు. వాళ్లకు అందరితోనూ పరిచయాలుంటాయి. అందరికీ సహాయపడుతుంటారు. అందరికీ కావాల్సిన వారై ఉంటారు. వాళ్లు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కరణ్ జోహార్. అతడు నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. దర్శకత్వంలో మంచి విజయాలు సాధించాడు. ధర్మ ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. అక్కడ సూపర్ హిట్ చిత్రాలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అందరు స్టార్ హీరోలతో మంచి సంబంధాలున్నాయి.

ఇక కొత్త నటీనటులను, వారసులను పరిశ్రమకు పరిచయం చేయాలంటే కరణ్ దగ్గరకే వస్తారు. అలియా, సిద్ధార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్ లాంటి వారెందరినో కరణ్ జోహార్ పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్థానంలో నటుడిగానూ తన సత్తా చూపాలనుకున్నారు కరణ్. అయితే తాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలన్నీ అపజయాలయ్యాయి. దీంతో నన్ను నటుడిగా తీసుకోవద్దంటూ ఆయనే స్వయంగా చెబుతున్నారు. కరణ్ మాట్లాడుతూ నేను ప్రధాన పాత్రలో బాంబే వెల్వెట్, వెల్ కమ్ టు న్యూయార్క్ వంటి చిత్రాల్లో నటించాను. ఈ రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. దీంతో నన్ను ఎవ్వరూ సినిమాల్లో తీసుకోలేదు. నటుడిగా నాపై ప్రయోగాలు పనిచేయవని తెలుసుకున్నారని అన్నాడు.