ఆ ముగ్గురు పై ఛాలెంజ్ విసిరిన మెగాస్టార్‌

మెగాస్టార్‌ ‘చిరంజీవి’ ఎన్టీవీ ఛైర్మన్‌ నరేంద్ర చౌదరి విసిరిన (గ్రీన్‌ ఛాలెంజ్)‌ స్వీకరించారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. చిరంజీవి తన ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటారు. అనంతరం తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నామినేట్‌ చేశారు. (గ్రీన్‌ ఛాలెంజ్)‌ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ.. చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కాగా మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు, క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా పలువురు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

అయితే ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.