ఆ మేకప్‌తో అమితాబ్‌కు టార్చర్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ ‘అమితాబ్‌ బచ్చన్‌’ తనకు వేసే ప్రోస్తెటిక్‌ మేకప్‌తో టార్చర్‌ అనుభవిస్తున్నానని వాపోతున్నారు. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మస్త్రా’ చిత్రంతో పాటు సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ నటించబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ఆయన ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేసుకోవాలట. ఇలాంటి మేకప్‌తో తాను టార్చర్‌ అనుభవిస్తున్నానని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

‘నేను చేయబోయే రెండు సినిమాల్లో ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేయబోతున్నారట. ఇది నాకు టార్చర్‌లా అనిపిస్తోంది. గెడ్డం, విగ్గులకు ఉన్న బంక చిరాకు కలిగిస్తాయి. ఇలాంటి విగ్గులు, గెడ్డాలు జీవితాంతం పెట్టుకుంటూనే ఉంటానేమో. మున్ముందు నేను నిర్విరామంగా చిత్రీకరణల్లో పాల్గొనాల్సి ఉంది. ‘బ్రహ్మస్త్రా’ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇది చాలా పెద్ద చిత్రం. ఈ మూవీ తర్వాత సుజయ్‌ ఘోష్‌ తెరకెక్కించబోయే సినిమా కోసం స్కాట్‌ల్యాండ్‌ వెళ్లాలి. మళ్లీ ‘బ్రహ్మస్త్రా’ సినిమా కోసం బల్గేరియా వెళ్లాలి’ అని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న’సైరా’ నరసింహారెడ్డి సినిమాలోనూ కీలక పాత్ర పోషించనున్నారు అమితాబ్‌. ఈ పాత్ర కోసం ఆయన విగ్గు, గెడ్డం పెట్టుకున్నారు. వీటిని వేలానికి వేయాలనుకుంటున్నట్లు కూడా ఒకానొక సందర్భంలో తెలిపారు.