ఆ సినిమాల్లో నటించనంటోంది!

 

 

nikki1

 

కన్నడ బ్యూటీ నిక్కి గర్లాని తెలుగులో మలుపు, కృష్ణాష్టమి వంటి చిత్రాల్లో కనిపించింది.
నిజానికి ఈ భామ ‘యాగవరాయణుమ్ నాకాక్క’ అనే చిత్రంతో పరిచయం కావాల్సింది.
కానీ జీవీ ప్రకాష్ తో కలిసి చేసిన హారర్ రొమాన్స్ డార్లింగ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత
వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది సుమారుగా అమ్మడు చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్
ఉన్నాయి. అయితే మధ్యలో కూడా హారర్ సినిమాల్లో నటించమని ఆఫర్స్ వచ్చాయట. కానీ
నటించనని చెప్పేసిందట. వరుసగా హారర్ సినిమాల్లోనే నటిస్తే నా మీద హారర్ హీరోయిన్
అనే ముద్ర పడే అవకాశం ఉంది. అందుకే అటువంటి ఆఫర్స్ రిజక్ట్ చేశానని చెబుతోంది.
దయ్యం సినిమాల్లో కూడా పాత్రలు వైవిధ్యంగా ఉంటే నటిస్తానని చెబుతోంది. ప్రస్తుతం
అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలేనట. ఈ సినిమాలతో
యూత్ కు దగ్గరవ్వడం ఖాయమని చెబుతోంది.