ఆ హీరోపై మండిపడుతున్న దిల్‌రాజు

నిర్మాత దిల్‌రాజు, హీరో రాజ్‌తరుణ్‌తో కలిసి లవర్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరో రాజ్‌ తరుణ్‌పై దిల్ రాజుకి ఎందుకు కోపం వచ్చిందో గానీ పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. రాజ్‌తరుణ్ లాంటి హీరోతో లవర్‌ సినిమాను రూ. 8 కోట్లు పెట్టి తీయడమే ఆయన కోపానికి కారణమట. కొంత కాలంగా రాజ్‌ తరుణ్‌కి హిట్స్ లేవు.. వచ్చిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలవడంతో దిల్ రాజుకు ఎక్కడలేని టెన్షన్ పట్టుకుంది. అందుకే ఆ హీరోపై చులకనగా మాట్లాడుతున్నాడు.

రాజ్‌ తరుణ్‌కి మార్కెట్ లేకపోయినా రూ. 8 కోట్లు పెట్టి సినిమా తీశాం. మా బ్యానర్‌కి ఓ ఇమేజ్ ఉంది కాబట్టే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. అతడి సినిమాకి రూ. 5 కోట్లే ఎక్కువ అన్నాడు. రాజ్ తరుణ్ పక్కన నటించడానికి అగ్ర హీరోయిన్లు ఒప్పుకోరు.. ప్రతీ పాటకు ఓ సంగీత దర్శకుడిని పెడతానని మా హర్షిత్ అన్నాడు రాజ్ తరుణ్ సినిమాకు అవసరమా అన్నాను.. అయినా రాజ్‌ తరుణ్‌కి ఈ లవర్ కథ సరిపోతుంది కాబట్టే తీశామంటూ చులకనగా మాట్లాడాడు. ఈనెల 20న లవర్ సినిమా విడుదల కాబోతుంది.