HomeTelugu Reviewsఇంటిలిజెంట్ మూవీ రివ్యూ

ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ

చిత్రం: ఇంటిలిజెంట్‌
న‌టీన‌టులు: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, త‌దిత‌రులు
కథ, మాటలు: శివ ఆకుల
ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: త‌మన్‌
ఎడిటింగ్: గౌతంరాజు
నిర్మాత: సి.కల్యాణ్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌
మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంటెలిజెంట్’. సాయి ధరం తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!
teju 1కథ: 
తేజు(సాయి ధరం తేజ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. విజన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపనీ అధినేత నందకిషోర్(నాజర్) తేజుని సొంత కొడుకులా చూసుకుంటాడు. అతడే చదివిస్తాడు. ఓ పక్క కంపనీ నడిపిస్తూనే మరోపక్క అనాధలకు అండగా నిలబడుతూ స్వచ్చంద కార్యక్రమాలు చేస్తుంటాడు నందకిషోర్. ఇంతలో అతడి కంపనీను దక్కించుకోవాలని విక్కీభాయ్(రాహుల్ దేవ్) అనే మాఫియాడాన్ అనుకుంటాడు. దీనికోసం అతడిని చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తాడు. మరి విక్కీభాయ్ పై తేజు పగ తీర్చుకున్నాడా..? చివరకు కంపనీ ఏమవుతుంది..? అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్: 
సాయి ధరం తేజ్ నటన
నిర్మాణ విలువలు
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్: 
కథ, కథనం
వినోదం లేకపోవడం
విశ్లేషణ: 
పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో నడిపించిన ఈ కథ రొటీన్ కథనంతో సాగుతుంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నప్పటికీ వాటిలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవ్వలేడు. ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవడానికి ఏమిలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లో లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటితో ప్రేక్షకులను బాగా విసిగించారు దర్శకుడు. పతాక సన్నివేశాలు మరింత రొటీన్ గా ఉన్నాయి. ఏ వర్గపు ఆడియన్స్ కు కూడా ఈ ఇంటెలిజెంట్ పెద్దగా నచ్చదు. సాయి ధరం తేజ్ నటన, డాన్సులు, యాక్షన్ సన్నివేశాలతో సినిమాను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వర్కవు కాలేదు. లావణ్య త్రిపాఠి పాత్ర సినిమాకు అనవసరం. పాటలకు మాత్రమే పరిమితమైంది. టెక్నికల్ గా సినిమాను మంచి క్వాలిటీతో రూపొందించారు. తమన్ నేపధ్య సంగీతం బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. చిరు పాటను రీమిక్స్ చేసి చంపేశారు. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ తేజు మరోసారి ప్రేక్షకులను నిరాస పరిచి తన ఖాతాలో డిజాస్టర్ ను వేసుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

చిత్రం: ఇంటిలిజెంట్‌ న‌టీన‌టులు: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, త‌దిత‌రులు కథ, మాటలు: శివ ఆకుల ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌ సంగీతం: త‌మన్‌ ఎడిటింగ్: గౌతంరాజు నిర్మాత: సి.కల్యాణ్‌ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌ మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన చిత్రం 'ఇంటెలిజెంట్'. సాయి ధరం తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం! కథ:  తేజు(సాయి ధరం తేజ్) సాఫ్ట్ వేర్...ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ