‘ఇదం జగత్‌’ ఫస్ట్‌ లుక్‌

చాలా కాలంపాటు సరైన హిట్‌ కోసం ఎదురు చూసిన సుమంత్‌కు ‘మళ్లీ రావా’తో క్లాస్‌హిట్‌ లభించింది. తనకు కలిసి వచ్చిన ప్రేమకథతోనే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం సుమంత్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం సుమంత్‌ ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ను పట్టాలెక్కిస్తున్నారు .సుమంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇదం జగత్‌’. సుమం‍త్‌ జర్నలిస్ట్‌గా నటిస్తోన్నఈ సినిమాతో అనిల్‌ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో ప్రేమమ్‌ ఫేం అంజు కురియెన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంతో పాటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న’సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో నాగచైతన్య చిత్రం ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.