ఇద్దరు తారల మధ్య కండోమ్‌ వివాదం

వివాదాలతో ముందుండే బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్‌ తాజాగా మరో వివాదం సృష్టించింది. సోషల్ మీడియా వేదికపై మరో నటిపై తెగ రెచ్చిపోతూ బండబూతులు తిట్టేసింది. మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ నిషేధంపై హిందీ సీరియల్‌ నటి మహికా శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. రాఖీ సావంత్ ఓ కండోమ్‌ కంపెనీ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే రాఖీ నటించిన ఆ కండోమ్ యాడ్‌ ఫొటోను మహిక పోస్ట్ చేస్తూ అక్కా ప్లాస్టిక్ నిషేధిస్తే కండోమ్‌లను కూడా నిషేధించారా అని కామెంట్ పెట్టింది.

మహిక పోస్ట్‌నుచూసి రాఖీసావంత్‌ అగ్గిమీద గుగ్గిలమైంది. మహికాను తిట్టిపోసింది. కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది, వాటిని ప్లాస్టిక్‌ చేయరు.. రబ్బరుతో చేస్తారు.. అయినా కండోమ్‌లను బ్యాన్‌ చేస్తే మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్‌తో చచ్చిపోతారు అంటూ రిప్లై ఇచ్చింది. మరో వీడియోలో మహికాపై బూతుల వర్షం కురిపించింది. మహికా కూడా ఊరుకోకుండా కౌంటర్‌గా తానుకూడా రాఖీసావంత్‌ను తిట్టిపడేసింది. ప్లాస్టిక్ బ్యాన్ అంశం కాస్త కండోమ్ వరకు వెళ్లి బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది.