ఇళయరాజా వివాదాస్పద వ్యాఖ్యలు!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అది అరెస్ట్ దాకా వెళ్తుందంటూ కధనాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన అమెరికాలోని సిలికాన్ వేలిలో ఉన్న గూగుల్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లినప్పుడు అక్కడ స్టాప్ తో మాట్లాడుతూ… ఏసు క్రీస్త్రుపై కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడవే ఇబ్బంది పెడుతున్నాయి.క్రీస్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ”కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయాక తిరిగొచ్చారు. క్రీస్తు కూడా చనిపోయాక తిరిగొచ్చారని చెబుతారు కానీ అందుకు తగిన ఆధారాలు లేవు” అని ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చెన్నై పోలీసు కమిషనర్‌కు క్రైస్తవ సంఘాలు ఫిర్యాదు చేశాయి.