HomeTelugu Newsఈద్‌ ముబారక్‌ - జీరో నుంచి మరో ట్రైలర్‌

ఈద్‌ ముబారక్‌ – జీరో నుంచి మరో ట్రైలర్‌

షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జీరో’ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుక్‌ మరగుజ్జు పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శుక్రవారం రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించిన స్పెషల్‌ టీజర్‌ను షారుక్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్‌ అంత స్పెషల్‌ ఎందుకంటే..ఇందులో షారుక్‌తో పాటు సల్మాన్‌ కూడా ఉన్నాడు.

1 11

ఈ ట్రైలర్‌లో షారుక్‌ నడుచుకుంటూ వెళుతుంటే..’నేను ఇంతకాలం ఒంటరిగా ప్రయాణిస్తూ వచ్చాను. కానీ నా వెంట ప్రేక్షకులు కూడా వస్తూనే ఉన్నారు. నా కారావాన్‌ సైజ్‌ పెరుగుతూనే ఉంది. కానీ ప్రేక్షకులు ఒకరి కోసం ఎదురుచూస్తున్నారు. వారెవరో కాదు మన టైగర్‌ సల్మాన్‌ ఖాన్‌’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలిచింది. షారుక్‌ జనాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ వారంతా తన కోసమే ఎదురుచూస్తున్నారనుకుని ఫోజులివ్వడం నవ్వులు పూయిస్తోంది. వెనుక నుంచి సల్మాన్‌ వచ్చి..’ఏంటి భగవత్‌ సింగ్‌..నువ్వు ఇతరుల జీవితాలను మార్చేస్తావట’ అని చెప్తున్నప్పుడు షారుక్‌ తల పైకెత్తి సల్మాన్‌ని చూస్తున్న తీరు ఫన్నీగా ఉంది. షారుక్‌, సల్మాన్‌ కలిసి స్టెప్పులేయడం, చివర్లో షారుక్‌..సల్మాన్‌ చంకెక్కి ముద్దుపెట్టుకోవడం ఆకట్టుకుంటోంది. సల్మాన్‌ పక్కన షారుక్‌ చిన్న పిల్లాడిగా కన్పిస్తున్నారు. ‘మా ఇద్దరి తరుఫున యావత్‌ హిందుస్థాన్‌కు ఈద్‌ ముబారక్‌’ అన్న డైలాగ్‌ హైలైట్‌ గా నిలిచింది.

షారుక్‌ ఖాన్‌ పై అభిమానంతోనే ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నానని సల్మాన్‌ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ‘నేను జీరో. అందుకే ‘జీరో’ చిత్రంలో నటించాను’ అని సల్మాన్‌ చమత్కరించారు. ఈ చిత్రంలో షారుక్‌కు జోడిగా కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ నటిస్తున్నారు. అజయ్‌-అతుల్‌ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu