‘ఈ నగరానికి ఏమైంది?’ అతిథిగా కేటీఆర్‌

తరుణ్‌భాస్కర్‌ పెళ్లి చూపులు మొదటి సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌. ఈ సినిమా తరుణ్‌ భాస్కర్‌ను స్టార్‌ డైరెక్టర్‌గా నిలబెట్టింది. తన రెండో సినిమాను చాలా గ్యాప్‌ తీసుకుని సురేష్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ రోజు(జూన్‌ 25) నిర్వహించారు.

ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిర్‌ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. సినిమా పరిశ్రమతో అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆర్‌ ఇటీవలే రంగస్థలం, భరత్‌ అనే నేను ప్రమోషన్‌​ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది? కేటీఆర్‌తో పాటు రానా, నాగ చైతన్య, విజయ్‌దేవరకొండ మొదలైన వారు పాల్గొన్నారు.టీజర్‌, సాంగ్స్‌, పోస్టర్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ సినిమాను.. నలుగురు స్నేహితుల పాత్రల చుట్టూ తిరిగే కథగా తెరకెక్కించారు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమా కూడా పెళ్లి చూపులు సినిమాలా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతమందించిన ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.