‘ఈ నగరానికి ఏమైంది’ ట్రైలర్‌ రీలీజ్‌

ప్రముఖ నిర్మాణ సంస్ధ సురేశ్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను, అనీశా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రెలర్‌ ఈ రోజు విడుదలైంది.

ఆరుగురు వ్యక్తులు తమ జీవితాల్లో ఏం చేయాలనుకుంటున్నారో ఓ విభిన్న కథాంశంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆరుగురి మధ్య సాగే సంభాషణలు, సన్నివేశాలు ఫన్నీగా చూపించారు. ఓ వ్యక్తి ‘ఆఫీస్‌కి ఎందుకు పోలేదు’ అని అడిగితే..ఇందుకు మరో వ్యక్తి ‘ఈ రోజు నాగుల పంచమి’ అనడం నవ్వుల పూయిస్తోంది. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌ లోని అని డైలాగ్‌లు ఫన్నీగా ఉన్నాయి.