ఈ నగరానికి ఏమైంది? మూవీ రివ్యూ

movie-poster
Release Date
June 29, 2018

సినిమా : ఈ నగరానికి ఏమైంది?
నటీనటులు : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌
నిర్మాతలు : డి. సురేష్‌ బాబు
సంగీతం : వివేక్‌ సాగర్‌


‘పెళ్ళి చూపులు’ వంటి మూవీతో తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌.‌. ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అంతేకాకుండా డిఫరెంట్ ప్రమోషన్స్‌ కూడా సినిమా మీద ఆసక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. పది, పదకొండు చిన్న సినిమాలు ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన ప్రత్యేకతను కనబరచనున్నాడా? మరి కొత్త నటులతో తరుణ్‌ భాస్కర్‌ చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది, పోస్టర్లు, ట్రైలర్‌ ద్వారా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌గా చెప్పుకొన్ని ఈ చిత్రం సక్సస్‌ అయ్యిందా..?

కథ: నాలుగులు మిడిల్‌ క్లాస్‌ యువకుల మధ్య జరిగే కథే ‘ఈ నగరానికి ఏమైంది?’ (విశ్వక్‌ సేన్ నాయుడు) వివేక్‌ పాత్రలో, (సుశాంత్‌) కార్తిక్‌ పాత్రలో, (అభినవ్‌ గోమఠం) కౌశిక్‌ పాత్రలో, (పెంకటేష్‌ కాకుమాను) ఉపేంద్ర పాత్రలో నటిస్తున్నారు. వీరు నాలుగురు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. కౌశిక్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ..ఎప్పటికైనా యాక్టర్‌ స్థిరపడాలనుకుంటాడు. కార్తీక్‌ తాను వర్క్‌ చేసే క్లబ్‌ యాజమాని కుతురుని పెళ్ళి చేసుకొని అమెరికాలో మాకం పెట్టలనుకుంటాడు. ఉపేంద్ర పెళ్లి వీడియోలను ఎడిటింగ్‌ చేస్తాడు. వివేక్‌ షార్ట్‌ ఫిల్మ్‌స్ తీసి తన టాలెంట్‌ని ఫ్రూవ్‌ చేసుకోవాలనుకుంటాడు. లవ్‌ ఫెల్యూర్‌ కావాడంతో మధ్యానికి దగ్గరై స్నేహితులకు దూరమైపోతాడు. కానీ ఉహించని విధంగా కార్తీక్‌కి ప్రేమించిన ఓనర్‌ కూతురుతోనే పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవాడానికి నాలుగు స్నేహితులు కలుస్తారు. బార్‌లో ఫ్రెండ్స్‌ అంతా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. ఆ విధంగా గోవా చేరిన వీరు ఏం చేశారు, ఈ జర్నీ వారికి జీవితం అంటే ఎంటో తెలిసోచ్చిందా, ఈ ట్రిప్‌ వారిలో ఎలాంటి మార్పు తీసుకువచ్చంది అన్నదే కథ.

నటీనటులు : కొత్త నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నడు అని చెప్పావచ్చు. సినిమా అంతా నలుగురు స్నేహితుల చుట్టూనే తిరుగుతోంది. అభినవ్‌ కనిపించిన చాలా సన్నీవేశంలో తన నటనతో ప్రేక్షకులను కడుపు నవ్వీస్తాడు. చిన్న చిన్న పంచ్‌ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు అభినవ్‌. సినిమాకు ఫ్లస్ పాయింట్‌ కౌశిక్‌ పాత్రలో నటించిన అభినవ్‌ గోమఠం. ఇతర పాత్రల్లో సుశాంత్‌ ఉపేంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్‌ ప్రేమ కథలో శిల్ప పాత్రలో నటించిన సిమ్రాన్‌ చౌదరి గ్లామర్‌ గా కనిపించింది. అనీషా ఆంబ్రోస్‌ మోడ్రన్‌, అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: ‘పెళ్లి చూపులు’ వంటి విజయావంతమైన చిత్రం తరువాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ ఎంచుకున్న యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాని కూడా అంతే డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. కథలో కొత్తధనం కనిపించింది. ఎమోషన్స్‌, బిల్డప్‌ సీన్స్‌, డ్రామా ఎక్కడా ఇరికించినట్లు లేకుండా సినిమా మొత్తం సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే రోటీన్‌ కథను ఆసక్తికరంగా స్ర్కీన్‌ పై చూపడంలో తరుణ్ భాస్కర్‌ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్‌ చేశాడు. ‘ జీవితమంటే..నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ. నచ్చిన పని చేసుకోవడమే’ లాంటి డైలాగ్స్‌ మనసును హత్తుకుంటాయి. స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్‌ ప్రేమకథను, బ్రేకప్‌లను మాత్రం చాలా సాదాసీదాగా చూపించాడు. తొలి భాగం కామెడీ సన్నివేశాలతో వేగంగా నడిచిన కథ ..రెండో భాగంలో మాత్రం కొంచెం నెమ్మదించింది అనిపించింది. వివేక్‌ సాగర్‌ అందించిన పాటలు పర్వలేదనిపించినా…నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి సారించాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.

హైలైట్స్
యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథ
స్నేహితుల మధ్య సన్నివేశాలు
డైలాగ్స్‌

డ్రాబ్యాక్స్
అక్కడక్కడ కథ బలం లోపించడం
ప్రేమ కథ

చివరిగా : పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 
Rating: 3/5

https://www.klapboardpost.com

యూత్ ని ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం అనడంలో సందేహం లేదు
Rating: 3/5

https://www.tollywood.net

‘ఈ నగరం’లో అంతా కామెడీనే ఇంకేమీ వెతకొద్దు!
Rating: 3/5

https://telugu.samayam.com