ఈ మాయ పేరేమిటో టీజర్‌ను విడుదల చేసిన నాగ చైతన్య

రాహులు విజయ్‌, కావ్య థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. హీరో నాగాచైతన్య దీనిని విడుదల చేశారు. టీజర్‌ లో ‘నువ్వు ఇంతగా ప్రేమిస్తే నా దగ్గర తిరిగివ్వడానికి ఏమీ లేదు’ అని రాహుల్‌ చెప్తున్న డైలాగ్‌, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సోదరుడు అఖిల్‌ నటించిన ‘హలో’ చిత్రంలోని ‘ఈ మాయ పేరేమిటో’ పాటను సినిమా టైటిల్‌గా పెట్టడం విశేషం.

ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తాను నాగచైతన్యకు వీరిభిమానినని పేర్కొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దివ్య విజయ్‌, రాజేంద్రప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళి శర్మ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.