ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్వీ ఔట్‌!

బుల్లితెర పై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. శని, ఆదివారలు వచ్చిందంటే ఈ షో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎలిమినేషన్‌, నాని చేసే హోస్టింగ్‌, ఇంటిలో జరిగి హడవిడి కోసం ప్రేక్షకులు ఎదురుచుస్తూ ఉంటారు. అయితే నిన్న శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని తనదైన శైలితో అలరించాడు. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై రివ్యూ ఇచ్చాడు. ప్రతి సభ్యుడి నటనను మెచ్చుకున్నాడు. ఇక ఈ వారంలో హైలైట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడాడు. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌, గణేష్‌ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్‌ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్‌ గురించి చేసిన హంగామా.. నందిని, కౌశల్‌ మధ్య జరిగిన సంభాషణలపై వారితో చర్చించాడు. కొత్త కెప్టెన్‌ కు తనీష్‌కు అభినందనలు తెలిపాడు. ఎలిమినేషన్‌ లో ఉన్న రోల్‌రైడా, దీప్తీ, తనీష్‌లను ప్రోటెక్ట్‌ అయ్యారని చెప్పి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమజంట తేజస్వి మదివాడ, సామ్రాట్ రెడ్డి లో ఒకరు ఎలిమినేట్‌కాక తప్పదు అని పేర్కొన్నాడు నాని. అయితే ఈ సస్పెన్స్‌తో ఆదివారం ఎపిసోడ్ రేటింగ్స్‌ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్‌కి గట్టి దెబ్బ తగిలింది. తొలి వారం సంజన ఎలిమినేషన్‌ తప్ప తరువాత అని వారాల్లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయం ముందే తెలిసిపోతుంది.

అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఎదురు చూస్తూ.. ఉంటారు. ఆదివారం జరిగే ఎపిసోడ్ ఒకరోజు ముందే షూట్ చేస్తారు. వారి ద్వారానే ఎలిమినేట్ అయింది ఎవరు? అనే విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. అయితే ఈ షూట్‌కు హజరైన ప్రేక్షకులు ఎలిమినేషన్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి ఈ వారం తేజస్వీ ఎలిమేనేట్‌ అవుతుందని అందరూ ఊహించినదే… అనుకున్నట్లుగానే.. ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్‌ అయింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్‌ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బయటకు వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి.