‘ఉద్యమ సింహం’ కేసిర్‌ బయోపిక్‌

ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఈ బయోపిక్స్ కి ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ కూడ లభించడంతో దర్శక, నిర్మాతలు ప్రముఖుల జీవితా కథలను ఆవిష్కరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే సావిత్రి బయోపిక్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఓవర్సీస్‌లో మంచి రికార్టులు సాధించింది. తాజా గా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం మొదలైంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు దిగవంతనేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ మూవీ ఈ మధ్యనే మొదలైంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపించగా, మహి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఈ రూట్‌లోకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బయోపిక్ రూపొందుతోంది. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో సీనియర్‌ నటుడు నాజర్ నటిస్తున్నారు.. ‘ఉద్యమ సింహం’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్నిఅల్లూరి కృష్ణం రాజు తెరకెక్కించనున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మాణంలో ఈ బయోపిక్ రూపొందనుంది. ఈ రోజే(గురువారం) అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభమైంది. నటీనటులు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.