ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో `బొమ్మలరామారం`

ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో `బొమ్మలరామారం`
సినిమా ప్రమోషన్స్ లో కొత్త విధానానికి ఇప్పుడు నిర్మాతలు శ్రీకారం చుడుతున్నారు. అందులోభాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్రమోషన్స్ ను చేస్తున్నారు. అందులోభాగంగా మూడు చక్రాల సైకిల్ పై తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఈ విధానం. ఈ విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బొమ్మలరామారం చిత్రయూనిట్. మేడియవాల్‌ స్టోరీ టెల్లర్స్‌ సమర్పణలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘బొమ్మల రామారం’. నిషాంత్‌ దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో పాటు చెడుపై మంచి ఎప్ప‌టికైనా విజ‌యాన్ని సాధిస్తుంద‌నే చ‌క్క‌టి మెసేజ్ ఈ చిత్రంలో చెప్పామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ సినిమా ద్వారా 50 న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు,ఈ సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్ళడానికి యూనిట్ చేసే ప్రయత్నాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ తిరువీర్‌, సంకీర్తన, ప్రియదర్శి, విమల్‌ కృష్ణ, మోహన్‌ భగత్‌, గుణకర్‌, శివ తదితరులు పాల్గొన్నారు.
IMG_20160803_144003007
CLICK HERE!! For the aha Latest Updates