‘ఎన్టీఆర్‌’తో మోక్షజ్ఞ ఎంట్రీ

ప్రముఖ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా వచ్చేనెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోని పాత్రలపై ఇప్పటికే రకరకాల వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ ఎన్టీఆర్‌గా శర్వానంద్‌ కనిపించబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ పాత్రను మోక్షజ్ఞ చేస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్ చెప్పారని.. ఎన్టీఆర్ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలకృష్ణకు కూడా అనుకుంటున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం మోక్షజ్ఞను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.