ఎన్టీఆర్‌లో ఆమె ఫిక్స్

నందమూరి తారక రామారావు బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘యన్‌టిఆర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను హిందీలోనూ విడుదల చేయనున్నారు.

ఇందులో ఎవరెవరు ఏ పాత్రల్లో నటించబోతున్నారు అనే విషయం పై పలు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోతోంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటీకే ఈ సినిమాలోని పలు పాత్రల గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది.