‘ఎన్టీఆర్‌’లో ఆ హీరో నటించడం లేదట.. కారణం ఏమిటంటే..

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ నటిస్తోంది. కాగా అక్కినేని నాగేశ్వరావు పాత్రలో అతని మనవడు హీరో సుమంత్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ చిత్రంలో తన తాత అయిన నాగేశ్వరావు పాత్రలో సుమంత్‌ నటించడం లేదని తెలుస్తోంది . ఎన్టీఆర్‌ అక్కినేని సమకాలీకులు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ గొప్పతనమే తప్ప అక్కినేని గురించి గొప్పగా ఏమి ఉండదు కానుక నే ఆ పాత్ర పోషించి తాతయ్య ఇమేజ్‌ని తగ్గించడం ఎందుకు? అని అనుకుంటున్నాడట.

తాతయ్య అంటే సుమంత్‌కి చాలా గౌరవం అంతే కాదు కొడుకుల కంటే ఎక్కువంగా సమంత్‌నే ఎక్కువగా ఇష్టపడేవడట నాగేశ్వరావు. అందుకే ఆ చిత్రంలో తాతయ్య పాత్ర ని పోషించి తక్కువ చేయడం ఎందుకు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే ఎన్టీఆర్‌ దర్శకులు క్రిష్ మాత్రం అక్కినేని పాత్రలో సుమంత్ అయితేనే బాగుంటుందని మళ్ళీ ఓ ప్రయత్నం చేయాలనీ భావిస్తున్నాడు . ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

CLICK HERE!! For the aha Latest Updates