ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’కు తప్పని లీకుల బెడద

ప్రముఖ కథానాయకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో పూజహెగ్టే కథానాయిక కాగా ఈషా రెబ్బ కీలక పాత్ర పోషస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌ ‘వీర రాఘవ’ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పడం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్‌ లీక్‌ అయ్యింది. ఈ స్టిల్‌లో కారు డ్రైవ్‌ చేస్తున్నట్లుగా ఎన్టీఆర్‌, పక్కన నాగబాబు ఉన్నారు. కాగా ఈ చిత్రంలో ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది.. దానితో ఎన్టీఆర్‌ భావోద్వేగంతో చూస్తూ కనిపించారు.

ఇప్పడు ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. కాగా ఈ చిత్రాన్నికి తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్‌ 10వ తారీఖున ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.