ఎన్టీఆర్‌ పై శ్రీరెడ్డి కామెంట్స్‌

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ఆమె ఇటీవల సినీ ప్రముఖులపై వివాదాస్పదంగా మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. ‘టు దిస్‌ జనరేషన్‌ జూనియర్‌ ఎన్టీఆర్ ఈజ్‌ కింగ్‌ ఆఫ్‌ ఎ టాలీవుడ్‌. బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్‌ సింహం’ అని పోస్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి గతంలో కూడా ప్రశంసలు కురిపించారు. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ను బిగ్‌బాస్‌ షోలో అందరూ మిస్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ స్థానాన్ని ఎవరూ రిప్లేస్‌ చేయలేరు. అతని రాకతో ప్రజలు నిరాశలో ఉన్నారు. సాహో యంగ్‌ టైగర్‌’ అని తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

హీరో నానిని కూడా శ్రీరెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాక నాని తనను బిగ్‌బాస్‌లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. దీనిపై నాని శ్రీరెడ్డికి లీగల్‌ నోటిసులు పంపారు. ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుందామని శ్రీరెడ్డి సవాలు విసిరారు. ప్రస్తుతం నాని బిగ్‌బాస్‌ సీజన్‌2 కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి పై విధంగా కామెంట్లు పెట్టారు.